బీర తో లాభాలెన్నో

ridge-gourd-2.jpg

ప్రస్తుత ప్రపంచంలో యువతి యువకులు అందానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో మనం చెప్పుకో అక్కర్లేదు. అయితే వారిని అధిక బరువు అనే సమస్య బాగా వేధిస్తోంది. నాజుగ్గా కనిపించడానికి ఎన్నో రకాల పాట్లు పడుతున్నారు. సహజసిద్ధంగా బరువు తగ్గాలనే అనే ఆలోచనని  చాలామందికి పాటించే ప్రయత్నం చేస్తున్నారు.

సాధారణంగా తెలుగు ప్రజలు బీరకాయను అప్పుడప్పుడు వినియోగిస్తుంటారు. కానీ బీరకాయ ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలిస్తే రోజు బీరకాయను వాడతారు. కేవలం బరువు తగ్గించడానికి మాత్రమే కాకుండా మరెన్నో ఆరోగ్య సమస్యలకు బీర సంజీవనిగా పనిచేస్తుందని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. బరువు తగ్గడానికి ఈ కూరగాయ తింటే ఎన్ని లాభాల్లో తెలుసుకుందాం.

బరువు తగ్గాలనుకునే వారికి బీరకాయ ఒక దివ్య  ఔషధంగా పనిచేస్తుంది. సహజంగా బీరకాయలో ఫైబర్‌ శాతం ఎక్కువగా ఉండి, క్యాలరీలు తక్కువగా ఉంటాయి, కాబట్టి కొవ్వును సైతం సులభంగా కరిగించే శక్తి బీరకే  సొంతం.

బీరను రోజూ తినడం వల్ల శరీరంలో చక్కెర శాతాన్ని అధికం కాకుండా నివారించవచ్చు. మరోవైపు బీర శరీరంలో ఇన్సూలిన్‌ ఉత్పత్తిని క్రమపద్ధతిలో ఉంచుతుంది. బీరలో శరీరానికి కావాల్సిన పెప్టైడ్స్‌, ఆల్క్‌లైడ్స్‌ ఎక్కువగా ఉండడం వల్ల శరీర రక్షణ వ్యవస్థను బలంగా ఉంచడంలో బీర కీలక పాత్ర పోషిస్తుంది. మధుమేహం ఉన్నవారు(డయాబెటిస్‌) నిత్యం బీరకాయను ఉపయోగించడం ఎంతో అవసరమని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

మీరు నిత్యం లివర్‌, నేత్ర(కళ్ల), సమస్యలతో బాధపడుతున్నారా?  అయితే మీకు రోగనిరోధక శక్తి తక్కువగా ఉందని అర్థం చేసుకోవాలి. అనారోగ్య సమస్యలతో నిత్యం సతమతమైయ్యేవారు బీరకాయను విరివిగా తీసుకోవడం వల్ల రక్షణవ్యవస్థను బలంగా ఉంచే విటమిన్లు, ఖనిజాలు, ఐరన్‌, మాగ్నిషియమ్‌, థయమిన్‌ తదితర పోషకాలు శరీరానికి పుష్కలంగా లభిస్తాయి. రోగాలను ఎదుర్కోవాలంటే బీరకాయను వాడాల్సిందే.

ముఖ్యంగా స్త్రిలు సరిపడ పోషకాహారం తీసుకోక రక్తహీనత సమస్యని ఎదుర్కుంటూ వుంటారు . ఐరన్‌ అందకపోవడమే రక్తహీనతకు ప్రధాన కారణంగా నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా ఎర్ర రక్తకణాల కౌంట్‌లో ఐరన్‌ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే నిత్యం బీరకాయను తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్యకు చెక్‌ పెట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

ఆహార లోపాల వల్లే చర్మ సంబంద సమస్యలు ఉత్పన్నమవుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అయితే మీరు బీరకాయను నిత్యం వాడుతుంటే నిగనిగలాడే మెరిసే చర్మ సౌందర్యం మీ  సొంతం చేసుకోవచ్చు.

ర‌ష్మికా మజాకా!

Rashmika.jpg

అవ‌కాశం వ‌చ్చేంత‌వ‌ర‌కే అవస్థలు. ఒక్క‌సారి అవ‌కాశం గుమ్మం తట్టి, తదుపరి స‌క్సెస్ అయ్యామా  ఇక గారెల బుట్టలో పడ్డ చందమే. హీరోయిన్ల విష‌యంలో ఇది ఎన్నోసార్లు ఋజువు అయ్యింది. తాజాగా క‌న్న‌డ కథానాయకి  ర‌ష్మిక మంద‌న్నా పెద్ద మొత్తంలో రెమ్యూన‌రేష‌న్ డిమాండ్ చేస్తూ నిర్మాత‌ల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. క‌న్న‌డ చిత్ర పరిశ్ర‌మ‌లో ల‌క్ష‌ల్లోనే పారితోషికం అందుకున్న ఈ భామ టాలీవుడ్‌కు మ‌కాం మార్చాక రేటు అమాంతం పెంచేసింది. తెలుగులో తొలి చిత్రం ‘ఛ‌లో’తో ప్రేక్ష‌కుల‌ను తన  బుట్ట‌లో వేసుకున్న ఈ భామ, ఆ త‌ర్వాత న‌టించిన ‘గీతా గోవిందం’ తో  బంప‌ర్ హిట్ కొట్టింది. దీంతో బ‌డా నిర్మాత‌ల ఆమె చుట్టూ క్యూ కట్టారు.

అలా స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టించే అవ‌కాశాన్ని అందెపుచ్చుకుంది . దీంతో ర‌ష్మిక తెలుగులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. అయితే గీతాగోవిందం స‌క్సెస్ వ‌ర‌కు ఆమె ఒక్క సినిమాకు రూ.50 ల‌క్ష‌లలోపే వ‌సూలు చేసింది. కానీ సంక్రాంతి బ‌రిలోకి దిగిన‌ మ‌హేశ్‌బాబు సూప‌ర్ డూప‌ర్ హిట్ చిత్రం ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’ విజ‌యంతో ర‌ష్మిక త‌న‌ రెమ్యూన‌రేష‌న్‌ను రెండు కోట్ల రూపాయ‌ల‌కు పెంచిందని వినికిడి‌. తెలుగులో కొన్నేళ్లుగా సినిమాలు చేస్తున్న కొంద‌రు హీరోలు కూడా ఇంత పారితోషికం అందుకోక‌పోవ‌డం గ‌మనార్హం. కాగా ర‌ష్మిక ప్ర‌స్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప’, శ‌ర్వానంద్ ‘ఆడాళ్లూ మీకు జోహార్లు’ చిత్రంలో న‌టిస్తోంది.

1000 వ విజయాన్ని అందుకున్న స్పెయిన్ బుల్

2910013-59813268-2560-1440.jpg

స్పెయిన్‌ బుల్‌ రాఫెల్‌ నాదల్‌ తన విజయ పరంపరలో  మరో అడుగు ముందుకేశాడు. పారిస్‌ మాస్టర్స్‌–1000 టెన్నిస్‌ టోర్నమెంట్‌లో ప్రిక్వార్టర్స్‌కు చేరడం ద్వారా తన 1000వ విజయాన్ని అందుకున్నాడు. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన రెండో రౌండ్‌ మ్యాచ్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్‌ నాదల్‌ 4–6, 7–6 (7/5), 6–4తో ఫెలిసియానో లోపెజ్‌ (స్పెయిన్‌)పై గెలుపు బావుటా ఎగుర వేసాడు. తద్వారా ఓపెన్‌ శకం (1968 తర్వాత)లో వేయి విజయాలు సాధించిన నాలుగో ఆటగాడిగా రికార్డుల కెక్కాడు.

నాదల్‌కంటే ముందు ఈ జాబితాలో జిమ్మీ కానర్స్‌ (1,274), రోజర్‌ ఫెడరర్‌ (1,242), ఇవాన్‌ లెండిల్‌ (1,068) మాత్రమే ఉన్నారు. 2002 ఏప్రిల్‌ 29న 16 ఏళ్ల వయసులో రమోన్‌ డెల్గాడో (పరాగ్వే)పై గెలుపుతో తన విజయాల వేటను ఆరంభించిన నాదల్… 2011లో జరిగిన బార్సిలోనా ఓపెన్‌ సెమీఫైనల్లో ఇవాన్‌ డొడిగ్‌ (క్రొయేషియా)పై నెగ్గడంతో కెరీర్‌లో 500వ విజయాన్ని అందుకున్నాడు. ఈ ఏడాది జరిగిన ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో చాంపియన్‌గా నిలవడం ద్వారా 20వ గ్రాండ్‌స్లామ్‌ను సాధించిన నాదల్‌… పురుషుల విభాగంలో ఫెడరర్‌ పేరిట ఉన్న అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ రికార్డు (20)ను సమం చేశాడు.

యూపీఐ లావాదేవీల జోరు

UPI.jpg

కోవిడ్‌కు ముందున్న స్థాయితో పోలిస్తే ప్రస్తుతం దేశంలో యూపీఐ లావాదేవీలు విలువ, పరిమాణం పరంగా 1.7 రెట్లు అధికమయ్యాయని ఎస్‌బీఐ వెల్లడించింది. అన్‌లాక్‌ తదనంతరం అయిదు నెలల కాలంలో భారత్‌లో వివిధ రంగాల్లో నెలకొన్న పరిస్థితులపై ఎస్‌బీఐ పరిశోధన నివేదికను విడుదల చేసింది. ఎస్‌బీఐ గ్రూప్‌ చీఫ్‌ ఎకనమిక్‌ అడ్వైజర్‌ సౌమ్య కాంతి ఘోష్‌ రాసిన ఈ నివేదిక ప్రకారం.. సెప్టెంబరు నెలలో ఋణాలు సంఖ్య పెరిగినప్పటికీ అక్టోబరు నెలలో ఆ ఊపును  అందుకోలేకపోయింది. రుణాల వృద్ధి రేటు  5.1 శాతంగా  నమోదైంది. గతేడాది ఇది 8.9 శాతం. రెండవ త్రైమాసికంలో బ్యాంకుల పనితీరు మెరుగుపడింది. సూక్ష్మ ఋణ సంస్థలు సైతం మెరుగైన పనితీరు కనబరిచాయి. మ్యూచువల్‌ ఫండ్ల నిర్వహణలో ఉన్న ఆస్తులు తగ్గాయి. హామీ లేని

ఋణాలు 2020 సెప్టెంబరు నెలతో పోలిస్తే అక్టోబరు నెలలో 48 శాతం తగ్గి, రూ.1.02 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఈ ఏడాది జూన్ నెల‌తో పోలిస్తే ఎన్‌బీఎఫ్‌సీల్లో మ్యూచువల్‌ ఫండ్ల వాటా రూ.6,554 కోట్లు తగ్గి, సెప్టెంబరు మాసంలో రూ.47,678 కోట్లకు దిగొచ్చాయి. అక్టోబరు మాసంలో జీఎస్టీ ఆదాయం గతేడాది ఇదే నెలతో పోలిస్తే 10 శాతం అధికమైంది. ఈ–వే బిల్లులు రికార్డు స్థాయిలో సెప్టెంబరులో 5.74 కోట్లుగా  నమోదైతే, అక్టోబరులో ఈ సంఖ్య 6.42 కోట్లకు ఎగబాకాయి. అత్యవసర వస్తువులు తయారు చేసే కంపెనీలు మెరుగైన ఆర్థిక ఫలితాలు ప్రకటించాయి. అత్యవసరం కాని ఉత్పత్తులు, సేవల్లో ఉన్న కంపెనీల ఆదాయం బలహీనపడింది.

scroll to top