CSK తో శనివారం జరిగిన మ్యాచ్‌లో DC విజయం సాధించింది. 20వ ఓవర్ జడేజా వేసాడు. ఈ ఓవర్ లొ అక్షర్ వరుసగా రెండు సిక్స్‌లు కొట్టి మ్యాచ్‌ను తమవైపుకు తిప్పుకున్నాడు. అయితే 20వ ఓవర్ను జడేజా చేతికి ధోని ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. బ్రేవో ఫిట్‌గా లేడు గనుక చివరి ఓవర్‌ను జడేజాకు ఇవ్వాల్సి వచ్చిందని ధోని వివరణ ఇచ్చాడు.
మొదత బాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 180 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. అంబటి రాయుడు(45 నాటౌట్; 4 సిక్స్‌లు, 1ఫోర్,) రవీంద్ర జడేజా(33 నాటౌట్; 13 బంతుల్లో 4 సిక్స్‌లు), డుప్లెసిస్ (58; 47 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. ఆపై ఢిల్లీ టార్గెట్ ఛేదించే క్రమంలో ధావన్ (అజేయంగా 101 పరుగులు) జట్టు విజయం సాధించే వరకూ క్రీజ్‌లో ఉండి అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు.