బీర తో లాభాలెన్నో

ridge-gourd-2.jpg

ప్రస్తుత ప్రపంచంలో యువతి యువకులు అందానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో మనం చెప్పుకో అక్కర్లేదు. అయితే వారిని అధిక బరువు అనే సమస్య బాగా వేధిస్తోంది. నాజుగ్గా కనిపించడానికి ఎన్నో రకాల పాట్లు పడుతున్నారు. సహజసిద్ధంగా బరువు తగ్గాలనే అనే ఆలోచనని  చాలామందికి పాటించే ప్రయత్నం చేస్తున్నారు.

సాధారణంగా తెలుగు ప్రజలు బీరకాయను అప్పుడప్పుడు వినియోగిస్తుంటారు. కానీ బీరకాయ ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలిస్తే రోజు బీరకాయను వాడతారు. కేవలం బరువు తగ్గించడానికి మాత్రమే కాకుండా మరెన్నో ఆరోగ్య సమస్యలకు బీర సంజీవనిగా పనిచేస్తుందని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. బరువు తగ్గడానికి ఈ కూరగాయ తింటే ఎన్ని లాభాల్లో తెలుసుకుందాం.

బరువు తగ్గాలనుకునే వారికి బీరకాయ ఒక దివ్య  ఔషధంగా పనిచేస్తుంది. సహజంగా బీరకాయలో ఫైబర్‌ శాతం ఎక్కువగా ఉండి, క్యాలరీలు తక్కువగా ఉంటాయి, కాబట్టి కొవ్వును సైతం సులభంగా కరిగించే శక్తి బీరకే  సొంతం.

బీరను రోజూ తినడం వల్ల శరీరంలో చక్కెర శాతాన్ని అధికం కాకుండా నివారించవచ్చు. మరోవైపు బీర శరీరంలో ఇన్సూలిన్‌ ఉత్పత్తిని క్రమపద్ధతిలో ఉంచుతుంది. బీరలో శరీరానికి కావాల్సిన పెప్టైడ్స్‌, ఆల్క్‌లైడ్స్‌ ఎక్కువగా ఉండడం వల్ల శరీర రక్షణ వ్యవస్థను బలంగా ఉంచడంలో బీర కీలక పాత్ర పోషిస్తుంది. మధుమేహం ఉన్నవారు(డయాబెటిస్‌) నిత్యం బీరకాయను ఉపయోగించడం ఎంతో అవసరమని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

మీరు నిత్యం లివర్‌, నేత్ర(కళ్ల), సమస్యలతో బాధపడుతున్నారా?  అయితే మీకు రోగనిరోధక శక్తి తక్కువగా ఉందని అర్థం చేసుకోవాలి. అనారోగ్య సమస్యలతో నిత్యం సతమతమైయ్యేవారు బీరకాయను విరివిగా తీసుకోవడం వల్ల రక్షణవ్యవస్థను బలంగా ఉంచే విటమిన్లు, ఖనిజాలు, ఐరన్‌, మాగ్నిషియమ్‌, థయమిన్‌ తదితర పోషకాలు శరీరానికి పుష్కలంగా లభిస్తాయి. రోగాలను ఎదుర్కోవాలంటే బీరకాయను వాడాల్సిందే.

ముఖ్యంగా స్త్రిలు సరిపడ పోషకాహారం తీసుకోక రక్తహీనత సమస్యని ఎదుర్కుంటూ వుంటారు . ఐరన్‌ అందకపోవడమే రక్తహీనతకు ప్రధాన కారణంగా నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా ఎర్ర రక్తకణాల కౌంట్‌లో ఐరన్‌ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే నిత్యం బీరకాయను తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్యకు చెక్‌ పెట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

ఆహార లోపాల వల్లే చర్మ సంబంద సమస్యలు ఉత్పన్నమవుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అయితే మీరు బీరకాయను నిత్యం వాడుతుంటే నిగనిగలాడే మెరిసే చర్మ సౌందర్యం మీ  సొంతం చేసుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top