గూగుల్‌ చెల్లింపు విధానాలపై సీఐఐ దృష్టి

gpay.png

ఇంటర్నెట్‌ దిగ్గజ సంస్థ గూగుల్‌ చెల్లింపు విధానాలపై కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) దృష్టి సారించింది. గూగుల్‌ పే, గూగుల్‌ ప్లే స్టోర్‌ చెల్లింపు విధానాల్లో కంపెనీ అనుచిత వ్యాపార విధానాలు అమలు చేస్తోందన్న ఆరోపణలపై లోతుగా విచారణ జరపాలంటూ డైరెక్టర్‌ జనరల్‌ను ఆదేశించింది. గూగుల్‌కు చెందిన ‘పే’ అనేది డిజిటల్‌ పేమెంట్స్‌ ప్లాట్‌ఫాం కాగా ‘ప్లే’ అనేది ఆండ్రాయిడ్‌ సాధనాలు, ఉత్పత్తులకు సంబంధించి యాప్‌ స్టోర్‌. తన గుత్తాధిపత్యంతో పోటీ సంస్థలను దెబ్బతీసే విధంగా గూగుల్‌ విధానాలు ఉంటున్నాయని సీసీఐ వ్యాఖ్యానించింది.

గూగుల్ ప్లేస్టోర్‌లోని పెయిడ్‌ యాప్స్ , ఇన్‌– యాప్స్ కొనుగోళ్లకు తప్పనిసరిగా గూగుల్‌ ప్లే చెల్లింపు విధానాన్నే ఉపయోగించాలంటూ గూగుల్‌ నిబంధన విధించడం వల్ల డెవలపర్లకు మరో ప్రత్యామ్నాయాన్ని ఎంచుకునే అవకాశం లేకుండా పోతోందని పేర్కొంది. ఫీజులు కూడా భారీగా వసూలు చేయడం వల్ల డెవలపర్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని సీసీఐ అభిప్రాయం వ్యక్తం చేసింది . ఈ నేపథ్యంలో అల్ఫాబెట్‌ (గూగుల్‌ మాతృసంస్థ), గూగుల్‌ ఎల్‌ఎల్‌సీ, గూగుల్‌ ఐర్లాండ్, గూగుల్‌ ఇండియా, గూగుల్‌ ఇండియా డిజిటల్‌ సర్వీసెస్‌పై విచారణ జరపాలని తమ డైరెక్టర్‌ జనరల్‌కు ఆదేశాలను జారీ చేసింది.

కరోనా ఆట

Co.jpg

ఐఐటీ మద్రాస్‌ విద్యార్థులు పిల్లల్లొ అవగాహన పెంచడానికి ఐఐఎమ్‌ కోవిడ్‌ గేమ్‌ని రూపొందించారు. ప్రసిద్ధ సూపర్‌ మరియో గేమ్‌ని ఆదర్శంగా తీసుకుని దీన్ని రూపొందించారు. ఒక నిమిషం పాటు సాగే కోవిడ్‌-19 ఆటలో గరిష్ట పాయింట్లు సాధించడానికి సరైన పనులు చేయాలి. మీ పిల్లలు కరోనా జాగ్రతలు పాటించడం లేదా? అయితే వారితో ఈ గేమ్‌ ఆగించండి. గేమ్ ఆడాక మీకే ఎలా భద్రంగా ఉండాలో చెప్తారు. ఈ గేమ్ పన్నెండు ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంది. కోవిడ్‌-19 పై పిల్లల్లో అవగాహన కల్పించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇదొక బ్రౌజర్‌ బేస్డ్‌ గేమ్‌ దీన్ని మోబైల్‌, టాబ్లెట్‌, లాప్‌టాప్‌, పీసీ ఎందులోనైనా డౌన్లోడ్ చేసుకుని ఆడొచ్చు. కోవిడ్‌ మహమ్మారి నుంచి బయటపడటానికి కేంద్ర ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ ఈ గేమ్‌ని రూపొందించారు.

ఎక్కువ పాయింట్లు సాధించినవారు విన్నర్‌. సరైన పనులు అంటే గేమ్‌లోని పాత్రలు సరైన కోవిడ్‌ జాగ్రత్తలు పాటించినప్పుడల్లా (మాస్క్‌ ధరించటం, శానిటైజర్‌ వాడటం, సోషల్‌ డిస్టెన్స్‌ పాటించడం ) ఒక పాయింట్‌ కలుస్తుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే పాయింట్లు కోల్పోతారు.ఐఐఎమ్‌ కోవిడ్‌ గేమ్‌ని వసుధ టీకే, ఎన్‌ఎస్‌ కీర్తి, శివప్రియ వెళైచామీ అనే విద్యార్థులు రూపొందించారు. ఈ గేమ్‌ని విద్యార్థులు జనవరి నుంచి మే మధ్య అందించే లెట్స్‌ ప్లే టూ లెర్న కోర్స్‌లో భాగంగా రూపొందించారు. ఈ కోర్సులో 30 మంది విద్యార్థులు పాలుపంచుకుని వివిధ అంశాలపై బోర్డ్‌ గేమ్స్‌ రూపొందించారు. ఇందులో ముగ్గురు కవిడ్-19 సంబంధిత గేమ్‌ని తయారుచేశారు. కొందరి అభిప్రాయం సేకరించిన తర్వాత గేమ్‌ని ఇంకొన్ని ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి తేవాలని నిశ్చయించారు. సమాజానికి ఉపయోగపడే ఇలాంటి మరిన్ని గేమ్స్‌ని రూపొందిస్తామని విద్యార్థులు అంటున్నారు.

బీహార్ ఎన్నికల్లో MLA గా నితీష్ కుమార్ పోటీ చేస్తారా?

Nitish-Kumar-PTI-1.jpg

రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నిక 2020 లో నితీష్ కుమార్ వరుసగా నాల్గవ ఎన్నికల విజయాన్ని కోరుతున్నారు. ఖచ్చితంగా చెప్పాలంటే, నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా ఐదుసార్లు ప్రమాణం చేశారు – 2015 లో రెండుసార్లు, 2010, 2005, 2000.

నితీష్ కుమార్ 1977 లో మొదటిసారి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. నితీష్ కుమార్ చివరిసారిగా 1985 లో బీహార్ అసెంబ్లీకి సాధారణ ఎన్నికలలో పోటీ చేశారు.

అనంతరం నితీశ్ కుమార్ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆరుసార్లు గెలిచారు. అతని చివరి లోక్సభ ఎన్నిక 2004 లో. 2005 లో బీహార్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఆయన రాజీనామా చేశారు.

2014-15లో తొమ్మిది నెలల స్వల్ప కాలం మినహా ఆయన నవంబర్ 2005 నుండి బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రధాని నరేంద్రమోదీతో రాజకీయ విభేదాలపై 2014 లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి విజయం సాధించిన నేపథ్యంలో నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.

జితాన్ రామ్ మంజీని బీహార్‌లో ముఖ్యమంత్రిగా నియమించారు. నితీష్ కుమార్ ఆ సంవత్సరంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2015 లో ముఖ్యమంత్రిగా తిరిగి వచ్చారు. లాలూ ప్రసాద్ ఆర్జెడి తో పొత్తు పెట్టుకుని అసెంబ్లీ ఎన్నికలను గెలిచారు. నితీష్ కుమార్ 2017 లో ఎన్డీఏ కి తిరిగి వచ్చారు.

నితీశ్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు, అతను బీహార్ శాసనసభ సభల్లోనూ సభ్యుడు కాదు. ఆయన పదవీకాలం ఎనిమిది రోజులు మాత్రమే కొనసాగింది. ఆయన రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యే అవసరం లేదు. తరువాత, నవంబర్ 2005 లో బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన రాష్ట్ర శాసనసభ సభ్యుడు కాదు. తరువాత ఏడాది ప్రారంభంలో శాసనమండలి సభ్యుడయ్యాడు. ఒక ముఖ్యమంత్రి లేదా మంత్రి రాష్ట్ర శాసనసభ సభ్యుడిగా ఉండటానికి చట్టం ప్రకారం ఇది అవసరం.

ఎమ్మెల్సీ (లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడు) గా నితీష్ కుమార్ పదవీకాలం 2012 లో ముగిసింది. ఆయన తిరిగి ఎగువ సభకు ఎన్నికయ్యారు.

ప్రస్తుత ఆరేళ్ల పదవీకాలం పూర్తయిన తర్వాత మరోసారి శాసనమండలికి ఎన్నికవుతాను అని నితీష్ కుమార్ అన్నారు.

2015 బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా నితీష్ కుమార్ మాట్లాడుతూ, ఒక సీటుపై తన దృష్టిని పరిమితం చేయకూడదనుకుంటున్నందున తాను రాష్ట్ర ఎన్నికలలో పోటీ చేయను అని చెప్పారు.

నితీష్ కుమార్ 2018 లో శాసనమండలికి వరుసగా మూడోసారి ఎన్నికయ్యారు. అతని పదవీకాలం 2024 లో ముగుస్తుంది.

CSK పై DC‌ విజయం

DC.jpg

CSK‌ తో శనివారం జరిగిన మ్యాచ్‌లో DC‌ విజయం సాధించింది. 20వ ఓవర్ జడేజా వేసాడు. ఈ ఓవర్ లొ అక్షర్‌ వరుసగా రెండు సిక్స్‌లు కొట్టి మ్యాచ్‌ను తమవైపుకు తిప్పుకున్నాడు. అయితే 20వ ఓవర్ను జడేజా చేతికి ధోని ఇవ్వడం హాట్‌ టాపిక్‌ గా మారింది. బ్రేవో ఫిట్‌గా లేడు గనుక చివరి ఓవర్‌ను జడేజాకు ఇవ్వాల్సి వచ్చిందని ధోని వివరణ ఇచ్చాడు.

మొదత బాటింగ్ చేసిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ 180 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. అంబటి రాయుడు(45 నాటౌట్‌; 4 సిక్స్‌లు, 1ఫోర్,) రవీంద్ర జడేజా(33 నాటౌట్‌; 13 బంతుల్లో 4 సిక్స్‌లు), డుప్లెసిస్‌ (58; 47 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. ఆపై ఢిల్లీ టార్గెట్‌ ఛేదించే క్రమంలో ధావన్‌ (అజేయంగా 101 పరుగులు) జట్టు విజయం సాధించే వరకూ క్రీజ్‌లో ఉండి అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు.

scroll to top